Politics12th Mar 02:58 PMSunil Byrisetty2 min read
ఉమ్మడి అనంత రైతాంగానికి 10 ఎకరాల వరకు రాయితీ ఇచ్చి ఆదుకోండి
అనంతపురం జిల్లా రైతాంగానికి వ్యవసాయ సంక్షేమ పథకాలలో ప్రత్యేక మినహాయింపు ఇచ్చి 10 ఎకరాల వరకు వర్తింపుజేసేలా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల
అనంతపురం జిల్లా రైతాంగానికి వ్యవసాయ సంక్షేమ పథకాలలో ప్రత్యేక మినహాయింపు ఇచ్చి 10 ఎకరాల వరకు వర్తింపుజేసేలా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కోరారు.
శాసనసభ సమావేశాల సందర్భంగా బుధవారం జీరో అవర్లో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగ సమస్యలపై ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
2014 నుంచి 2019 వరకు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పరికరాలకు 90 శాతం సబ్సిడీ ఇచ్చారని గుర్తు చేశారు.
అప్పట్లో రైతులకు 10 ఎకరాల వరకు వర్తించేలా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు.
గత వైసిపి పాలనలో పెద్ద రైతులకు 45 శాతం సబ్సిడీతో మిగతా ఎస్సీ, ఎస్టీ రైతులకు 50% రాయితీ మాత్రమే అందించడం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా మార్చాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు.
ఆ దిశగా అన్నదాతలు అడుగులు వేయాలంటే అనంతపురం ఉమ్మడి జిల్లా రైతులకు 10 ఎకరాల వరకు వ్యవసాయ రంగంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు.
అలాగే వ్యవసాయ రంగంలో పెద్ద రైతులకు 90% సబ్సిడీతో ఎస్సీ ఎస్టీలకు 100% రాయితీతో డ్రిప్, స్ప్రింకర్లు, వ్యవసాయ పరికరాలు అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నారు.
రాయలసీమకు మరి ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగ ప్రయోజనాల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం, ఆ దిశగా అడుగులు వేస్తుందని అన్నారు