News26th Apr 03:24 PMSunil Byrisetty1 min read

ఇటుకలు, ఇసుక మోసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

నిత్యం రాజకీయాలు, అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కూలీగా మారిపోయారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఇటుకలు, ఇసుక మోస్తూ శ్రమదానం చేశారు. ఇదంతా దుర్గమ్

ఇటుకలు, ఇసుక మోసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
నిత్యం రాజకీయాలు, అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కూలీగా మారిపోయారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఇటుకలు, ఇసుక మోస్తూ శ్రమదానం చేశారు. ఇదంతా దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాల కోసం చేశారు ఆమె. రామగిరి మండలం నసనకోటలో వెలిసిన దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలను చాలా ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే సునీత కూడా స్థానికులతో కలిసి శ్రమదానం చేశారు. సిమెంట్ ఇటుకలు మోస్తూ.. అలాగే ఇసుక గంపలు అందుకుంటూ పనులు చేశారు. అనంతరం గ్రామస్థులతోనే కలిసి గుడి మెట్ల వద్ద భోజనం చేశారు. ఆమె మాట్లాడుతూ మే నెల 14,15,16 వ తేదీలలో అమ్మవారి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇది నా ఊరు అని.. నేను ఇక్కడ పనుల్లో పాలుపంచుకోవడం నా బాధ్యత అని ఎమ్మెల్యే సునీత అన్నారు.
Raptadu
MLA Sunitha
Shramadan
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కూలీగా మారిపోయారు
దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు
గ్రామస్థులతోనే కలిసి గుడి మెట్ల వద్ద భోజనం
Scroll for the next article