News13th Jun 05:18 PMSunil Byrisetty1 min read
హంద్రీనీవా నీరందించండి
రాప్తాడు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న అప్పర్ పెన్నార్ (పేరూరు) ప్రాజెక్టుకు హంద్రీనీవా నీరు అందించే పనులు ప్రారంభించాలని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న అప్పర్ పెన్నార్ (పేరూరు) ప్రాజెక్టుకు హంద్రీనీవా నీరు అందించే పనులు ప్రారంభించాలని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రితో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో ప్రధానంగా.. అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ (పేరూరు) పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇందు కోసం పెండింగ్ లో ఉన్న భూసేకరణ మొదలు పెట్టాలని.. గతంలో భూములిచ్చిన రైతులకు పరిహారం మంజూరు చేయాలన్నారు. హంద్రీనీవా కాలువ పరిధిలో 1.10లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం రూ. 17 కోట్లతో తయారుచేసిన అంచనాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే పండమేరు వాగుపై రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి రూ. 4.90 కోట్లు నిధులు మంజూరు చేయాలన్నారు.