News14th Aug 11:12 AMSunil Byrisetty1 min read
2029 ఎన్నికలపై ఎమ్మెల్యే యరపతినేని జ్యోష్యం
2029 ఎన్నికలపై ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జ్యోష్యం చెప్పారు. 2029లో వైసీపీ అధికారంలోకి రాదంటూ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా వైసీపీ విషం చిమ్ముతోందంటూ గ
2029 ఎన్నికలపై ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జ్యోష్యం చెప్పారు. 2029లో వైసీపీ అధికారంలోకి రాదంటూ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా వైసీపీ విషం చిమ్ముతోందంటూ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శలు చేశారు. 151 స్థానాల నుంచి 11 సీట్లకు పడిపోయినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'చంద్రబాబు హయాంలో 1.80 లక్షల టీచర్ పోస్టులు ఇచ్చామని.. జగన్ ఒక్క డీఎస్సీ అయినా ఇచ్చారా?' అని ప్రశ్నించారు. 'వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే.. కూటమి ప్రభుత్వం అభివృద్ధి రాజకీయాలు చేస్తోందని' ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.