News1st May 11:01 AMSunil Byrisetty1 min read
'మే' డే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుజనా
నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే' డే' సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పురోగతిలో, ఆర
నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే' డే' సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచ పురోగతిలో, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో శ్రమజీవుల పాత్ర ఎనలేనిదన్నారు.
దేశ, రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణమే ధ్యేయంగా పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా పని చేస్తోందన్నారు.
కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు