Politics18th Mar 01:19 PMSunil Byrisetty1 min read

కేసుల్లో మన ఎమ్మెల్యేలే టాప్..

మనల్ని పాలించే ప్రజాప్రతినిధులు నేరచరితులని మీకు తెలుసా? తాజా ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలోని 4,092 మంది ఎమ్మెల్యేలలో 45 శాతం మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దేశంలోని 28 రాష్

కేసుల్లో మన ఎమ్మెల్యేలే టాప్..
మనల్ని పాలించే ప్రజాప్రతినిధులు నేరచరితులని మీకు తెలుసా? తాజా ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలోని 4,092 మంది ఎమ్మెల్యేలలో 45 శాతం మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ADR) నివేదిక విడుదల చేసింది. వీరిలో అధికంగా ఏపీ ఎమ్మెల్యేలపై కేసులున్నాయి. 175 ఎమ్మెల్యేల్లో ఏకంగా 138 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 79 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులతో ఏపీ అగ్ర స్థానంలో నిలిచింది. కేరళలో 69 శాతం, తెలంగాణలో 69 శాతం శాతం, బిహార్‌ లో 66 శాతం, మహారాష్ట్రలో 65 శాతం, తమిళనాడులో 59 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. తీవ్ర నేరాభియోగాలు ఉన్న శాసనసభ్యుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలే తొలి స్థానంలో ఉన్నారు. 56 శాతం ఎమ్మెల్యేలు అంటే 98 మంది నేతలపై తీవ్ర నేరాభియోగాలు నమోదయ్యాయి. తెలంగాణలోని 50 శాతం ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. బీజేపీ 1653 ఎమ్మెల్యేలలో 638 (39 శాతం) మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 436 మంది (29 శాతం) ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 646 ఎమ్మెల్యేలలో 339 (52 శాతం) మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 194 (30) మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలున్నాయి. టీడీపీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 115 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 82 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు నమోదయ్యాయి. నేతలు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన డేటా ఆధారంగా ఏడీఆర్ ఈ రిపోర్ట్ విడుదల చేసింది.
BJP
CONGRESS
ADR
TDP
Andhra Pradesh
News
MLAs Criminal Cases
బిజెపి
కాంగ్రెస్
Scroll for the next article