Education28th Aug 12:39 PMSunil Byrisetty2 min read

డీఎస్సీ సెలెక్షన్ లిస్టు విడుదల చేయాలి

డీఎస్సీ 2025 సెలెక్షన్ కు సంబంధించి జాబితా విడుదల చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ప్రభుత్వాన్ని కోరారు. అర్హత పొందిన అభ్యర్థులకు ఆన్లైన్ లో కాల్ లెటర్లు పంపటం జరిగిందన

డీఎస్సీ సెలెక్షన్ లిస్టు విడుదల చేయాలి
డీఎస్సీ 2025 సెలెక్షన్ కు సంబంధించి జాబితా విడుదల చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ప్రభుత్వాన్ని కోరారు. అర్హత పొందిన అభ్యర్థులకు ఆన్లైన్ లో కాల్ లెటర్లు పంపటం జరిగిందని తెలిపారు. ఈ విధంగా చేయడం వలన కొంతమంది అర్హత సాధించిన వాళ్ళకి కాల్ లెటర్లు రాలేదనే అపోహలు ఉన్నాయన్నారు. వివిధ రిజర్వడ్ కేటగిరీ వారు ఓపెన్లో సెలెక్ట్ అయిన వారిని కూడా రిజర్వడ్ కేటగిరీలో చూపించారు అంటున్నారు కావున అర్హత సాధించిన వారి సెలెక్షన్ లిస్టును విడుదల చేయాలని కోరారు. కేటగిరి వారి కటాఫ్ మార్కులను విడుదల చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి కోరారు. ఈ సందర్భంగా డీఎస్సీ 2025 కి సంబంధించి పలు సమస్యల మీద డీఎస్సీ కన్వీనర్, పాఠశాల విద్యా కమిషనర్, పాఠశాల ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖామంత్రి లోకేష్ లకు ప్రాతినిధ్యం చేయడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా డీఎస్సీ 2025 అభ్యర్థుల గందరగోళాన్ని నివారించడానికి సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తూ కేటగిరీ వారి కటాఫ్ మార్కులను విడుదల చేయాలని, అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే సందర్భంలో పోస్టుల ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకునే సందర్భంలో పొరపాటున గాని లేక అవగాహన లేక గాని లోయర్ క్యాడర్ పోస్టు ముందు పెట్టి తదుపరి హయ్యర్ క్యాడర్ పోస్టు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అటువంటి వారికి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని దూరవిద్య ద్వారా విద్యను అభ్యసించిన వారికి డీఎస్సీ రాయటానికి అనుమతి ఇవ్వడం జరిగిందని, కానీ సెలెక్ట్ అయ్యేసరికి మీకు అర్హత లేదని చెప్పడం సరికాదని వారిని కూడా సెలక్షన్ లిస్ట్ లో చేర్చాలని, అదేవిధంగా డి ఎస్ సి అప్లికేషన్ చివరి తేదీ నాటికి అర్హతలు సాధించి తదుపరి సర్టిఫికెట్లు వచ్చిన వారినీ ఉద్యోగ అర్హత సాధిస్తే వారిని కూడా సెలక్షన్ లిస్ట్లోకి చేర్చాలని ఎమ్మెల్సీ కోరారు.
Andhra Pradesh
DSC 2025
Selection List
Call Letters
Reservation Category
Cut-off Marks
Borra Gopi Murthy
Education Department
Teacher Recruitment
Applicant Eligibility
డీఎస్సీ సెలెక్షన్ లిస్టు విడుదల చేయాలి
Scroll for the next article