Telangana4th Jul 12:50 PMSunil Byrisetty1 min read

సీఎం కావడమే నా లక్ష్యం

ఎప్పటికైనా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. తన పార్టీ బీఆర

సీఎం కావడమే నా లక్ష్యం
ఎప్పటికైనా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. తన పార్టీ బీఆర్ఎస్ అని, అదే సమయంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయన్నారు. వాటిని తరిమేస్తేనే బీఆర్ఎస్‌కు మనుగడ ఉంటుందని వ్యాఖ్యానించారు. తనకు, సోదరుడు కేటీఆర్‌కు మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కానీ రాజకీయంగా కొంత గ్యాప్ వచ్చిందని కవిత స్పష్టం చేశారు. తాను కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పక అధికారంలోకి వస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.
Telangana
Politics
Brs
Mlc kavitha
KCR
KTR
letter
CM
తప్పకుండా ముఖ్యమంత్రి అవుతా ఎమ్మెల్సీ కవిత
Scroll for the next article