Politics10th Apr 04:08 PMSunil Byrisetty1 min read

పవన్‌పై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారన్నారు.

పవన్‌పై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారన్నారు. ఆయన సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, ఆయన వ్యాఖ్యలను పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వామపక్ష భావజాలం, చేగువేరా ఆదర్శం అన్నారన్నారు. సీపీఐ, సీపీఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన లెఫ్ట్ నుంచి రైట్‌కు వచ్చారని, బీజేపీతో చేరాక హిందూత్వం మీద అతిభక్తి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. వైసీపీ మినహా దాదాపు ఏపీలోని అన్ని పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారని, అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని ఎమ్మెల్సీ కవిత సంచలనం రేపారు
MLC Kavitha
Pawan kalyan
Janasena Party
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Scroll for the next article