News17th Aug 02:43 PMSunil Byrisetty1 min read
గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ నాగబాబు
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు కొణిదెల నాగేంద్రరావు (శ్రీ నాగబాబు)ని నామినేట్ చేస్తూ పర్యావరణ, అటవీ శాఖ G.O.Rt.No.93, తేదీ 17-08-2026ను జారీ చేసింది. ఈ నియామకంతోపాటు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగేంద్రరావుకి క్యాబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అటవీ పరిరక్షణ, పచ్చదనం పెంపు కలిపి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే దిశగా ఏపీ గ్రీన్ పనిచేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జిల్లాస్థాయిలో పాలక మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.