News31st Jul 12:15 PMSunil Byrisetty1 min read
బాలిక వైద్యానికి నాగబాబు ఆర్థిక సహాయం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బొంతుపేట గ్రామానికి చెందిన రెడ్డి దీపిక అనే బాలిక ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలుసుకున్న ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబ
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బొంతుపేట గ్రామానికి చెందిన రెడ్డి దీపిక అనే బాలిక ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలుసుకున్న ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తక్షణం స్పందించారు. ఆ బాలిక వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బాలికకి వైద్య ఖర్చులకు ప్రతీ నెల వేల రూపాయలు వైద్య ఖర్చులకు అవసరమవుతాయని నాగబాబు దృష్టికి తీసుకు రాగా ప్రభుత్వం ద్వారా సహాయం అందే విధంగా ప్రయత్నిస్తానని ఆయన భరోసానిచ్చారు.
అలాగే మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన బంకూరి పోలి నాయుడు బుధవారం ఎమ్మెల్సీ నాగబాబును కలిసారు. గతంలో జెడ్పీటీసీగా పోటీ చేసిన సందర్భంలో వైసీపీ మూకలు దాడి చేయడంతో తలకు గాయమై తద్వారా పక్షవాతానికి గురైనట్టు పోలి నాయుడు తెలియజేశారు. పోలి నాయుడు విద్యార్హతలకు అనుగుణంగా ఏదైనా ఉద్యోగం లభించే విధంగా ప్రయత్నిస్తానని నాగబాబు భరోసానిచ్చారు.