News2nd Aug 12:16 PMSunil Byrisetty1 min read

పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "వన్ స్టేషన్-వన్ ప్రోడక్ట్" పథకంలో భాగ

పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "వన్ స్టేషన్-వన్ ప్రోడక్ట్" పథకంలో భాగంగా సెర్ప్ విభాగం వారిచే పిఠాపురంలో ఏటికొప్పాక బొమ్మలతో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్ స్టాల్ నాగబాబు ప్రారంభించారు. వీర మహిళ పిల్లా రమ్య జ్యోతి ఆధ్వర్యంలో ఈ స్టాల్ ఏర్పాటైంది. పిఠాపురం పట్టణం ఇందిరానగర్ లో జనసేన వీరమహిళ పిట్ట ముని ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నేపథ్యంలో స్థానిక జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ సహకారంతో పునర్నిర్మించిన ఆ ఇంటిని నాగబాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వ్యవసాయ ఆధారిత పనుల కోసం ఉపయోగించే ఫెర్టిలైజర్ డ్రోన్ పని చేసే విధానాన్ని పిఠాపురంలో శిక్షణ పొందిన యువకులను నాగబాబు అడిగి తెలుసుకున్నారు.
Andhra Pradesh
Janasena
Nagababu
Pithapuram
One Station One Product
Etikoppaka Toys
Handicraft Stall
వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్
పిఠాపురం
Scroll for the next article