Politics14th Mar 12:10 PMSunil Byrisetty1 min read

కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అందుకే!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధించిన నేతగా కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. అయితే టీడీపీ మంత్రి

కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అందుకే!
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధించిన నేతగా కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. అయితే టీడీపీ మంత్రి పదవి ఇవ్వలేదనే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎత్తుకున్నారని విజయశాంతి వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్నప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారని పేర్కొన్నారు. తన తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేయమని కేసీఆరే వెంట పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఇద్దరమే కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయ్యారని ప్రశ్నించారు. దొరలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారా అంటూ విజయశాంతి నిలదీశారు.
Vijayshanthi
KCR
Telangana
కేసీఆర్
విజయశాంతి
Scroll for the next article