Politics3rd Mar 11:00 AMSunil Byrisetty1 min read

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేడే

గుంటూరు ఏసీ కాలేజీలో ఏర్పాట్లు పూర్తి ఆలపాటి, లక్ష్మణరావు మధ్యే హోరాహోరీ కౌటింగ్ టేబుళ్లు 28...సిబ్బంది 750... మొత్తం ఓట్లు 3,47,116....పోలైనవి 2,41,502 ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్ల

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేడే
గుంటూరు ఏసీ కాలేజీలో ఏర్పాట్లు పూర్తి ఆలపాటి, లక్ష్మణరావు మధ్యే హోరాహోరీ కౌటింగ్ టేబుళ్లు 28...సిబ్బంది 750... మొత్తం ఓట్లు 3,47,116....పోలైనవి 2,41,502 ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కిం పునకు సర్వం సిద్ధమైంది. ఆదివారం అంతా గుంటూరు జిల్లా యంత్రాంగం లెక్కింపు కేంద్రం వద్దే ఉండి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు సోమవారం ఉదయం 8 గంటలకు గుంటూరు ఏసీ కాలేజీలో ప్రారంభం కానుంది. పోలింగ్ రోజున చోటుచేసుకున్న ఘట నలను దృష్టిలో పెట్టుకుని రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు లెక్కింపు కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బరిలో 25 మంది అభ్యర్ధులు నిలిచారు. ప్రధాన పోటీ మాత్రం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్యే నెలకొంది. గత నెల 27న జరిగిన పోలింగ్లో పట్టభద్రులు రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Guntur district
MLC Election
AP News
గుంటూరు జిల్లా
ఎమ్మెల్సీ ఎన్నికలు
ఏపీ వార్తలు
Scroll for the next article