Business Type7th Jul 01:45 PMSunil Byrisetty1 min read

మరోసారి మొబైల్ రీచార్జిలపై వడ్డన

సెల్ ఫోన్ రీచార్జిల ధరలు పెరగనున్నాయా? గతేడాది తరహాలో మరోసారి వడ్డించనున్నారా అంటే అవుననే తెలుస్తోంది. గతేడాది రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచిన మొబైల్ నెట్‌వర్క్‌ కంపెనీలు మరో

మరోసారి మొబైల్ రీచార్జిలపై వడ్డన
సెల్ ఫోన్ రీచార్జిల ధరలు పెరగనున్నాయా? గతేడాది తరహాలో మరోసారి వడ్డించనున్నారా అంటే అవుననే తెలుస్తోంది. గతేడాది రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచిన మొబైల్ నెట్‌వర్క్‌ కంపెనీలు మరోసారి పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరికి దేశీయ టెలికాం సంస్థలు మొబైల్‌ టారిఫ్‌లను 10-12 శాతం పెంచే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్‌, మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్లు పెరగడం, 5జీ సదుపాయాల నేపథ్యంలో ఈ పెంపు ఉండొచ్చు. గతేడాది జులైలో బేస్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరలు సగటున 11-23శాతం పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికి మరో 10-12శాతం పెంచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డేటాను వినియోగించే నిర్దిష్ట సమయాల ఆధారంగా ఈ పెంపు ఉండొచ్చని తెలుస్తోంది.
Mobile recharges
mobile bills
5G network
Reliance Jio -Fiber
Airtel
mobile tariffs
prepaid plans
ఏడాది చివరికి మరో 10-12శాతం పెంచే అవకాశం
Scroll for the next article