Health23rd Jun 09:56 AMSunil Byrisetty1 min read
అర్ధరాత్రి వరకు ఉంటే ఇవి ఖాయం!
అర్ధరాత్రి వరకు ఫోన్లు, టీవీలు చూస్తూ 'కాలక్షేపం చేస్తున్నారా? అయితే ఈ సూచనలు మీకే. ఫోన్, టీవీ చూస్తూ.. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం వల్ల కొన్ని గంటలు మాత్రమే నిద్రపోతారు. దీంతో ఆక
అర్ధరాత్రి వరకు ఫోన్లు, టీవీలు చూస్తూ 'కాలక్షేపం చేస్తున్నారా? అయితే ఈ
సూచనలు మీకే. ఫోన్, టీవీ చూస్తూ.. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం వల్ల కొన్ని గంటలు మాత్రమే నిద్రపోతారు. దీంతో ఆకలిని నియంత్రించే లెప్టిన్, గ్రెలిన్ వంటి హార్మోన్లకు అంతరాయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర లేనప్పుడు శరీరం అధిక కేలరీల ఆహారాన్ని కోరుకుంటుందని, దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం ఇదే సాగితే రక్తపోటు, డిస్లిపిడెమియా, గుండె వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ వస్తాయని పేర్కొంది. అంతేకాకుండా కళ్ళ సమస్యలు, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి బోనస్ అంటున్నారు. కాబట్టి తొందరగా పడుకుని, త్వరగా లేవడం మంచిది.