News26th Nov 01:09 PMSunil Byrisetty1 min read

అమరావతిలో మాక్ అసెంబ్లీ.. మార్షల్స్ ఏం చేశారంటే!

ఏపీలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న

అమరావతిలో మాక్ అసెంబ్లీ.. మార్షల్స్ ఏం చేశారంటే!
ఏపీలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. మాక్‌ సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలాగౌతమ్‌, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు. డిప్యూటీ సీఎం గా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, అసెంబ్లీ స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి ఉన్నారు. అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. 45 వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం చేశారు. విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్న తన ఆలోచనని మంత్రి లోకేష్ ఇటీవల అసెంబ్లీలో ప్రతిపాదించగా సభ్యులంతా మద్దతు తెలిపారు. దాంతో వివిధ స్థాయిలలో విద్యార్థులకు పలురకాల పోటీలు పెట్టి నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్కరిని ఎంపిక చేశారు. విద్యార్థుల మాక్ అసెంబ్లీ లో ఒలింపిక్స్ చర్చపై అధికార, ప్రతిపక్షాల మధ్య డిబేట్ జరిగింది. ఒక దశలో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. కొందరిని మార్షల్స్ ఎత్తుకొని బయట వేశారు. అసెంబ్లీని పోలినట్టు వేసిన సెట్ లో ఈ కార్యక్రమం అంతా జరిగింది.
Andhra Pradesh
Mock Assembly
Amaravati
Constitution Day
Chandrababu Naidu
Speaker Ayyannapatrudu
Minister Lokesh
Student Assembly
Democratic Awareness
మంత్రి లోకేష్
విద్యార్థుల సభ
ప్రజాస్వామ్య అవగాహన
ఒలింపిక్స్ చర్చ
Scroll for the next article