News21st May 05:30 PMSunil Byrisetty1 min read
కడప విమానాశ్రయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
కడప విమానాశ్రయంలో ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాదులు విమానాశ్రయంపై దాడికి దిగితే, అటువంటి పరిస్థితిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో అర్ధం చేసుకునేందుకు OCTOPUS బృంద
కడప విమానాశ్రయంలో ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది.
ఉగ్రవాదులు విమానాశ్రయంపై దాడికి దిగితే, అటువంటి పరిస్థితిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో అర్ధం చేసుకునేందుకు OCTOPUS బృందం ఆధ్వర్యంలో ఈ డ్రిల్ చేపట్టారు. ఈ డ్రిల్‌కి ASP మూర్తి నేతృత్వం వహించారు.
జిల్లా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సిమ్యులేషన్‌లో ఉగ్రదాడి సంభవించిన సందర్భంలో పోలీసు శాఖ, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక శాఖల సమన్వయ చర్యలను పరిశీలించారు.
డ్రిల్లులో పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
ఈ మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో విభిన్న విభాగాల మధ్య సమన్వయం, స్పందన వేగం, తక్షణ చర్యలపై స్పష్టత పెరిగిందని అధికారులు తెలిపారు