National29th May 09:23 AMSunil Byrisetty1 min read
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. మరోసారి మాక్ డ్రిల్!
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం ఉద్రిక్తతలు అదుపులోకి వచ్చాయి. ఇటీవల ఓసారి సివిల్ మాక్ డ్రిల్ సైతం చేపట్టి పౌరులకు అవగాహనా కల్పించింది కేంద్రం. మరోసారి సివిల్ మాక్ డ్రి
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం ఉద్రిక్తతలు అదుపులోకి వచ్చాయి. ఇటీవల ఓసారి సివిల్ మాక్ డ్రిల్ సైతం చేపట్టి పౌరులకు అవగాహనా కల్పించింది కేంద్రం. మరోసారి సివిల్ మాక్ డ్రిల్ చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల చేపట్టినట్లు దేశ వ్యాప్తంగా కాకుండా కేవలం పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్న 4 రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. మాక్ డ్రిల్ సమయంలో కరెంట్ సరఫరా నిలిపివేస్తారు. 29న జమ్మూ కశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. శత్రు దాడుల సమయంలో, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పౌరులను సంసిద్ధం చేయడమే ఈ డ్రిల్ లక్ష్యం. మరోవైపు ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఇది అంతం కాదు ఆరంభమేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.