Education16th Sep 04:10 PMSunil Byrisetty1 min read

మంగళగిరిలో ‘మోడల్ లైబ్రరీ‘

మంగళగిరి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లోనూ మోడల్ గా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో మంత్రి నారా లోకేష్ ముందుకుసాగుతున్నారు. యువత తమ సామర్థ్యాలకు తగ్గట్టుగా ఉద్యోగాలు సాధించాలంటే పోటీ ప

మంగళగిరిలో ‘మోడల్ లైబ్రరీ‘
మంగళగిరి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లోనూ మోడల్ గా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో మంత్రి నారా లోకేష్ ముందుకుసాగుతున్నారు. యువత తమ సామర్థ్యాలకు తగ్గట్టుగా ఉద్యోగాలు సాధించాలంటే పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభను కనబరిస్తేగాని సాధ్యంకాదు. ప్రధానంగా పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మంగళగిరి శివాలయం పక్కనే గల గుంటూరు జిల్లా గ్రంథాలయసంస్థ ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతిదీ ఓ మోడల్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పూర్తిస్థాయి వసతులతో గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టారు. ఒక కోటీ 30 లక్షల అంచనా వ్యయంతో రెండతస్తుల గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలనే లక్ష్యంతో చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థులకు రెండు క్లాస్ రూములు నిర్మిస్తున్నారు. ఇందులో కాంపిటీటివ్, సాఫ్ట్ స్కిల్స్ (స్పోకెన్ ఇంగ్లీష్) వంటి తరగతులు నిర్వహిస్తారు. అలాగే డిజిటల్ లైబ్రరీ.. 20 కంప్యూటర్లు ఏర్పాటుచేస్తున్నారు.
Andhra Pradesh Development
Mangalagiri
Model Library
Nara Lokesh
Competitive Exams
Digital Library
Youth Empowerment
Employment Preparation
స్పోకెన్ ఇంగ్లీష్
సాఫ్ట్ స్కిల్స్
Scroll for the next article