News14th Aug 01:20 PMSunil Byrisetty1 min read
అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు
రాష్ట్ర అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు చేరాయి. రూ.40 కోట్లతో 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు..
రాష్ట్ర అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు చేరాయి. రూ.40 కోట్లతో 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు.. 20 వాటర్ బౌజర్లు.. 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను లాంఛ్ చేశారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులకు 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు తీసుకొచ్చారు. పెద్ద అగ్నిప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బౌజర్లు కూడా ప్రారంభించారు. ఇరుకైన, రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలు పని చేస్తాయి. తొలి దశలో ఇప్పటికే రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.