News6th Apr 11:38 AMSunil Byrisetty1 min read
మోదీ అమరావతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి మోదీ ఈ నెల మూడో వారంలో రానున్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి మోదీ ఈ నెల మూడో వారంలో రానున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన పర్యటన కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ కార్యక్రమానికి లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
వెలగపూడి సమీపంలోని సచివాలయం వెనుక ఉన్న 250 ఎకరాల్లో కార్యక్రమం నిర్వహించేందుకు పనులు ప్రారంభించారు.
సామాన్య ప్రజలతోపాటు వీవీఐపీలు, వీఐపీల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
సభాస్థలికి చేరుకునేందుకు మొత్తం 8 మార్గాలను గుర్తించారు.
ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు