Politics17th Jan 05:46 PMSunil Byrisetty1 min read
ట్రంప్ కు మోదీ దాసోహం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దాసోహం అవ్వడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కంట్రోల్ కమీషన్ ఛైర్మన్ కే నారాయణ ఎద్దేవా చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దాసోహం అవ్వడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కంట్రోల్ కమీషన్ ఛైర్మన్ కే నారాయణ ఎద్దేవా చేశారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరుగనున్న పార్టీ శతాబ్ది ముగింపు వేడుకలను పురస్కరించుకుని విజయవాడలో మాట్లాడుతూ ప్రపంచం నేడు ఉద్రిక్తత వాతావరణంలో ఉందని ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం అత్యంత దురదృష్టకరమైన చర్యగా అభివర్ణించారు. అణ్వాయుధాలు, డ్రగ్స్ సరఫరా నెపంతో వివిధ దేశాలపై దాడులకు తెగపడటం మంచి పరిణామం కాదన్నారు. ఆయా దేశాల రాజకీయ, ఆర్థిక మూలలపై దెబ్బ కొట్టేందుకు ట్రంప్ బ్లాక్ మెయిల్ సింబల్ గా నిలిచాడని పేర్కొన్నారు. దేశంలో పాలన చేస్తున్న మోదీ పర్యటనలో పేరుతో ఇతర దేశాల్లో ఎక్కువగా ఉంటున్నాడని, ట్రంప్ తో స్నేహసంధాలు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. సుంకాల పేరుతో భారీగా భారాలు మోపుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, నితిశ్ కుమార్ అండతో కేంద్రంలో బిజేపి పాలన చేస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోదీకి ఎందుకు వంతపాడుతున్నారని నిలదీశారు.