News2nd Aug 04:54 PMSunil Byrisetty1 min read
ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అండ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, భారీ స్థాయిలో ఆర్థిక సహాయం, జాతీయ ప్రాజెక్టులు, మౌలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, భారీ స్థాయిలో ఆర్థిక సహాయం, జాతీయ ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ప్రాజెక్టు పనులు కొనసాగించేలా చర్యలు చేపట్టిందన్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహకారం అందించడంతో పాటు, రాజధాని అభివృద్ధికి అవసరమైన మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి ప్రతి రంగంలోనూ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే ప్రాజెక్టుల వేగవంతం, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర సహకారం వంటి చర్యలు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని తెలిపారు.