National4th Jun 05:48 PMSunil Byrisetty1 min read

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్త కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. 2026 అక్టోబర్ 1 నుంచి తొలిదశ కులగణన చేపట్టనుంది అలాగే, 2

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం
దేశవ్యాప్త కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. 2026 అక్టోబర్ 1 నుంచి తొలిదశ కులగణన చేపట్టనుంది అలాగే, 2027 మార్చి 1 నుంచి రెండో దశలో కులాలవారీగా జనాభాను లెక్కించాలని భావిస్తోంది. తొలిదశలో ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్, లడఖ్, హిమాచల్‌లో కులగణన చేపట్టనుంది. రెండోదశలో దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల జనగణన ఆలస్యమైన విషయం తెలిసిందే. కులగణనతోపాటు జనాభా గణన కూడా జరగనున్నట్లు తెలుస్తోంది.
India news
caste census
modi
amit Shah
NDA Govt
కులగణనపై కేంద్రం
ఉత్తరాఖండ్
జమ్మూకశ్మీర్
లడఖ్
హిమాచల్ ప్రదేశ్‌
Scroll for the next article