International30th Oct 03:20 PMSunil Byrisetty1 min read
మోదీ మంచివాడే... కానీ కఠినమైన వ్యక్తి: ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ చూడటానికి ఎంతో మంచి వ్యక్తిలా కనిపిస్తారని, కానీ ఆయన చాలా కఠినమైన వ్యక్తి అని అమెరికా అధ్య
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ చూడటానికి ఎంతో మంచి వ్యక్తిలా కనిపిస్తారని, కానీ ఆయన చాలా కఠినమైన వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలో మాట్లాడిన ఆయన, భారత్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకాలు చేస్తామని ప్రకటించారు. ఇదే సందర్భంలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, అందుకు మోదీ కఠిన వైఖరే కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "భారత్, పాకిస్థాన్‌ల విషయానికొస్తే... నేను భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నాను. నాకు ప్రధాని మోదీపై గొప్ప గౌరవం, ప్రేమ ఉన్నాయి. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి" అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తాను మోదీకి ఫోన్ చేసి, "మీరు పాకిస్థాన్‌తో యుద్ధం ప్రారంభిస్తే మేం మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోలేం" అని చెప్పినట్లు ట్రంప్ గుర్తుచేసుకున్నారు. "మోదీ చూడటానికి మంచి వ్యక్తి అయినా, ఆయన చాలా కఠినమైనవారు. యుద్ధం చేసి తీరుతామన్నారు. అయితే నా మాటలు విన్న రెండు రోజులకే మోదీ, షెరీఫ్ నాతో మాట్లాడి యుద్ధాన్ని ఆపేశారు" అని ట్రంప్ వివరించారు.