News1st Aug 01:23 PMSunil Byrisetty1 min read
మోదీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నానన
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నానన్నారు. ఈ రోజు తాను ఇంత ఎమోషనల్ గా ఉండటానికి కారణం తాను కూడా ఉత్తరాంధ్రకు చెందిన వాడు కావడమని, ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఎంతో కాలంగా, తన చిన్నప్పటి నుంచి ఎయిర్ పోర్టు వస్తుందనే మాట వినేవాడినని, ఇప్పుడు నిజమైందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్తుంటారని, ఇప్పుడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి చూపించారని వివరించారు. ఉత్తరాంధ్రలో గూగుల్ వంటి పెద్ద సంస్థలెన్నో వచ్చాయని చెప్పారు. ప్రధాని, సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ఇప్పుడు తానొక మాట ఇస్తున్నానని, వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరం కలిసి పని చేస్తామని, మీతోపాటు నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.