News5th May 01:36 PMSunil Byrisetty1 min read

కుల గణన.. చారిత్రాత్మక నిర్ణయం!

దేశవ్యాప్తంగా కుల గణనపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యన్నారాయణ అన్నారు. బీసీ కులానికి చెంద

కుల గణన.. చారిత్రాత్మక నిర్ణయం!
దేశవ్యాప్తంగా కుల గణనపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యన్నారాయణ అన్నారు. బీసీ కులానికి చెందిన సంఘాలు దశాబ్దాల కాలం నుంచి వేచి చూస్తున్న తరుణంలో మోదీ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. 60 శాతం ఉన్న బీసీలకి ఉన్న హక్కులని పరిరక్షించేందుకు ఇతర సంక్షేమ పథకాల అమలుకు మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 1931నుంచి ఎలాంటి గణాంకాలు తీసుకోకుండా ఊహాజనకంగా మాత్రమే ఉంచారని, కాంగ్రెస్ చేసిన నిర్లక్ష్యంతో బీసీలకి అన్యాయం చేశారని పేర్కొన్నారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఆధారంగా గణంకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. 102 వ రాజ్యాంగ సవరణ ఆధారంగా బీసీలకున్న హక్కులని గణంకాలతో సాధ్యమవుతుందని వివరించారు.
Caste Census
PM Modi
Paka Satyanarayana
BJP
102 వ రాజ్యాంగ సవరణ
సంక్షేమ పథకాల అమలుకు మోదీ మంచి నిర్ణయం
బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్
కేంద్ర జాబితా
రాష్ట్ర జాబితా
Scroll for the next article