Entertainment22nd Jul 03:47 PMSunil Byrisetty1 min read
రజనీతో అనుబంధానికి 50 ఏళ్లు
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తన అనుబంధం 50 ఏళ్లకుపైగా కొనసాగుతోందని సినీ నటుడు మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆత్మీయ స్నేహితుడు రజనీ అంటూ పంచుక
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తన అనుబంధం 50 ఏళ్లకుపైగా కొనసాగుతోందని సినీ నటుడు మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆత్మీయ స్నేహితుడు రజనీ అంటూ పంచుకున్నారు. రజనీకాంత్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, తమ మధ్య గాఢమైన స్నేహం కొనసాగుతోందని తెలిపారు. తామిద్దరం మద్రాస్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై తొలిసారి కలిసినప్పుడు ఇద్దరి వద్దా ఏమీ లేవన్నారు. అప్పటికి నటులం కూడా కాదని, కానీ నాటి నుంచి ఈనాటి వరకు తమ స్నేహం అలాగే కొనసాగుతోందని చెప్పారు. రజనీని 'హే బ్లడీ తలైవా' అని ముద్దుగా పిలుస్తానన్నారు. నిత్యం 3-4 మెసేజులు, అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటామన్నారు. తనలోని కోపాన్ని అదుపు చేసుకోవడానికి "పుస్తకాలు చదవడం కాదు, వాటిని అనుసరించి కోపాన్ని వదిలేయ్" అని రజనీ సూచించారని మోహన్ బాబు తెలిపారు.