Entertainment8th Jul 05:50 PMSunil Byrisetty1 min read
స్వామీజీలతో కలిసి కన్నప్ప వీక్షించిన మోహన్ బాబు
కన్నప్ప చిత్రం విజయోత్సవంలో భాగంగా నాగ సాధువులు, మాతాజీలు గురువులతో కలిసి మోహన్ బాబు వీక్షించారు. కన్నప్ప చిత్రాన్ని ఇంతటి ఘనవిజయం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అఘోరా
కన్నప్ప చిత్రం విజయోత్సవంలో భాగంగా నాగ సాధువులు, మాతాజీలు గురువులతో కలిసి మోహన్ బాబు వీక్షించారు. కన్నప్ప చిత్రాన్ని ఇంతటి ఘనవిజయం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అఘోరాలకు, నాగ సాధువులకు, మాతాజీలకు, శాలువా కప్పి సత్కరించారు. ఈ చిత్రాన్ని నిర్మించడం పూర్వజన్మ సుకృతమన్నారు. తెలుగు ప్రజలందరూ తప్పక కన్నప్ప చిత్రాన్ని వీక్షించాలని కోరుకుంటున్నానని చెప్పారు. మంచు విష్ణు కన్నప్ప పాత్రలో జీవించాడని ప్రశంసించారు. కన్నప్ప చిత్రం ప్రతి ఒక్కరూ చూడాలి అని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
మోహన్ బాబు మీద అభిమానంతో హిమాలయాల నుంచి స్వామీజీలు రావడం విశేషమని అన్నారు.