News29th Oct 04:13 PMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు వర్షాలకు దెబ్బతిన్న పొలాల పరిశీలన

మొంథా తుఫాన్‌‌ వల్ల కురిసిన అకాల వర్షాలు రైతులపై తీవ్ర ప్రభావం చూపాయి. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పంట పొలాలు ముంపుకు గురై నష్టం వాటిల్లింది. రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం మంగళగిర

మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు వర్షాలకు దెబ్బతిన్న పొలాల పరిశీలన
మొంథా తుఫాన్‌‌ వల్ల కురిసిన అకాల వర్షాలు రైతులపై తీవ్ర ప్రభావం చూపాయి. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పంట పొలాలు ముంపుకు గురై నష్టం వాటిల్లింది. రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ బుధవారం పెదవడ్లపూడి గ్రామంలో పంటల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, “వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో వరి, అరటి , మినుము, క్యాలీఫ్లవర్ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి రైతు పంట నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేసి, వారికి సరైన నష్టపరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం” అని హామీ ఇచ్చారు. అలాగే, స్థానిక వ్యవసాయ విభాగం అధికారులకు వెంటనే పంట నష్టం వివరాలను సేకరించాలని సూచించారు. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుల పక్షాన నిలబడి సహాయం అందించేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్శనలో మంగళగిరి మండల వ్యవసాయ అధికారి శైలజారాణి, జిల్లా సీనియర్ నాయకులు మాదల రమేష్ బాబు, యోమినేని సుధాకర్, జాలాది సందీప్, జవ్వాది హనుమంతరావు, కట్టా దుర్గారావు,వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Montha Cyclone
Crop Damage
Farmers
Mangalagiri
Unseasonal Rains
Agriculture
Relief Measures
Minister Lokesh
Paddy
Banana
రైతులు
మంగళగిరి
పంట నష్టం
వ్యవసాయం
ప్రభుత్వ సహాయం
Scroll for the next article