News26th Oct 10:52 AMSunil Byrisetty1 min read
మోంథా తుఫాను - జిల్లాలకు ప్రత్యేక అధికారులు
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న 'మోంథా' తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ ఉత
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న 'మోంథా' తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 950 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అల్పపీడనం అక్టోబర్ 26న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా, అక్టోబర్ 28 ఉదయం నాటికి 'మోంథా' అనే పేరుతో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం కాకినాడ మధ్య తీరప్రాంతాన్ని తుఫాను దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం, వారికి సహాయ, పునరావాస చర్యలను సమన్వయం చేసే బాధ్యత అప్పగించింది. ఈ అధికారులు జిల్లా పరిపాలనకు సహకరించి, ప్రతి బాధిత వ్యక్తికి సహాయం అందించేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ప్రాంతీయ సమన్వయ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది.