News27th Oct 05:13 PMSunil Byrisetty1 min read

మోంథా తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు

మోంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు 3 రోజులు సెలవు ప్రకటించారు. అలాగే తుఫాన్ ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ఏపీ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రై

మోంథా తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు
మోంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు 3 రోజులు సెలవు ప్రకటించారు. అలాగే తుఫాన్ ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ఏపీ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తుఫాను తీవ్రత ఆధారంగా మరిన్ని మార్పులు చేయవచ్చని, ప్రయాణికులు గమనించాలని సూచించింది. తుఫాన్ తీవ్రంగా మారుతుండటంతో ప్రభుత్వం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటోంది.
Andhra Pradesh
Cyclone Update
Montha Cyclone
Train Cancellations
Visakhapatnam
East Coast Railway
AP Weather Alert
Montha Storm
AP Schools Holiday
Disaster Management
ఈస్ట్ కోస్ట్ రైల్వే
వాతావరణ హెచ్చరిక
తుఫాన్ అప్డేట్
Scroll for the next article