News27th Oct 12:10 PMSunil Byrisetty1 min read

మోంథా తుఫాన్.. విధ్వంసం తప్పదా..?

మోంథా తుఫాను ప్రభావం ఏపీపై గట్టిగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. తీరం దాటి క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని స్పష్టం చేసింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస

మోంథా తుఫాన్.. విధ్వంసం తప్పదా..?
మోంథా తుఫాను ప్రభావం ఏపీపై గట్టిగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. తీరం దాటి క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని స్పష్టం చేసింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని… భారీ వర్షాలు సైతం నమోదవుతాయని చెబుతోంది. గతంలో హుద్ హుద్, తితలి వంటి తుఫాన్లు ఏపీకి అపార నష్టం కలిగించాయి. మరోసారి అటువంటి హెచ్చరికలే వస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా ఉభయగోదావరితో పాటు విశాఖపట్నం, జిల్లాలకు భారీ హెచ్చరికలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా జిల్లాలో సైతం ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంటుంది. మరోవైపు తీరం వెంబడి ఉన్న పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Andhra Pradesh Weather
Montha Cyclone
Cyclone Alert
IMD Warning
Heavy Rains
AP News
Vizag
Godavari Districts
Hudhud
Titli
Cyclone Update
Scroll for the next article