News5th Sep 05:07 PMSunil Byrisetty1 min read
తల్లి తొలి గురువు, సీఎం చంద్రబాబు మరో గురువు
టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పని చేసేవారిపైనే విమర్శలు వస్తాయని అన్నారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వారు తనపై
టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పని చేసేవారిపైనే విమర్శలు వస్తాయని అన్నారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ 2029 లోపు మరో 3 డీఎస్సీలు నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు. తన తల్లి నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని, ఆమె తన తొలి గురువు అని పేర్కొన్నారు. సమాజంలో గౌరవంగా జీవించడం, తప్పు చేయకుండా బతకడం తన తండ్రి, సీఎం చంద్రబాబు అని వివరించారు. తొలి డీఎస్సీ ఏ విధంగా పారదర్శకంగా నిర్వహించామో, అదే విధంగా రాబోయే 3 డీఎస్సీలు నిర్వహిస్తామని చెప్పారు. దశాబ్దాలుగా భర్తీ జరగని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను వచ్చే ఏడాది ఏప్రిల్ లోగా భర్తీ చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.