National15th Jul 03:08 PMSunil Byrisetty1 min read
స్పెయిన్ నుంచి కాశీ వచ్చిన మహాతల్లి!
బనారస్ ఘాట్‌లపై విదేశీయులు కనిపించడం మామూలే కానీ..దాదాపు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి స్పెయిన్ నుంచి కాశీకి వచ్చిన ఈ 70 ఏళ్ల వృద్ధురాలి ఉద్దేశ్యం వేరు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జ
బనారస్ ఘాట్‌లపై విదేశీయులు కనిపించడం మామూలే కానీ..దాదాపు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి స్పెయిన్ నుంచి కాశీకి వచ్చిన ఈ 70 ఏళ్ల వృద్ధురాలి ఉద్దేశ్యం వేరు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ప్రమాదంలో మరియా థెరిసా 36 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స అందించినప్పటికీ అతడిని రక్షించలేకపోయారు. తన ఆఖరి సమయాన్ని గ్రహించి, తన అంత్యక్రియలను హిందూ పద్ధతిలో నిర్వహించి, తన చితాభస్మాన్ని కాశీలోని గంగలో నిమజ్జనం చేయాలని తన తల్లికి చివరి కోరికను తెలిపాడు. వయసు మీదపడి, కొడుకు చివరి కోరిక గురించి ఏం చేయాలనే సందిగ్ధంలో ఉన్న ఆమె దృఢ సంకల్పం మాత్రం వదలలేదు. కొంతమంది NRI స్నేహితుల నుండి సమాచారం సేకరించి, తన కొడుకు చివరి కోరికను తీర్చడానికి బయలుదేరింది. ముంబయి మీదుగా బనారస్ చేరుకుని భారతీయ దుస్తులు ధరించి కుమారుడి అస్థికలతో మణికర్ణిక ఘాట్‌కు చేరుకున్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ తల్లి తన కుమారుడి చితాభస్మాన్ని ప్రవహించే గంగలో కలిపింది. కాశీలో చితాభస్మాన్ని కలపడం ద్వారా తన కుమారుడికి ‘‘శివుడు తప్పకుండా నా కొడుక్కి మోక్షాన్ని ప్రసాదిస్తాడు’’ అని ఉద్వేగంగా చెప్పింది.