Mobiles15th Jun 12:20 PMSunil Byrisetty1 min read
కొత్త మోటోరోలా ఫోన్.. పిచ్చెక్కించే ఫీచర్లు!
మోటోరోలా తన సరికొత్త 5జీ మొబైల్ విడుదల చేస్తోంది. మోటోరోలా G సిరీస్లో భాగంగా మోటో G86 స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. గత ఏడాది విడుదలైన మోటో G85 5Gకి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. మోటోరోలా G86
మోటోరోలా తన సరికొత్త 5జీ మొబైల్ విడుదల చేస్తోంది. మోటోరోలా G సిరీస్లో భాగంగా మోటో G86 స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. గత ఏడాది విడుదలైన మోటో G85 5Gకి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. మోటోరోలా G86 5G ఫోన్ 6.67-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED ప్యానెల్‌తో రాబోతోంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్ గరిష్ట బ్రైట్‌నెస్ ఉంటాయని అంచనా. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iతో రావచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoCతో వస్తుందని అంచనా ఉంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP సోనీ IMX766 ప్రైమరీ షూటర్, బ్యాక్ సైడ్ 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో రావచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరా ఉంటాయని తెలుస్తోంది. 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. మోటో G86 5G ఫోన్ బేస్ మోడల్ ధర దాదాపు రూ. 20వేల రేంజిలో, స్టోరేజీ ఆప్షన్లను బట్టి రూ. 25వేల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి.