News29th Aug 03:51 PMSunil Byrisetty1 min read

దివ్యాంగుల స్వావలంబనకు ప్ర‌గ‌తి చ‌క్రాలు!

విభిన్న ప్ర‌తిభావంతులు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా తమ పనులు చేసుకునేందుకు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మోటరైజ్డ్ త్రిచ‌క్ర వాహనాలు ఎంతో దోహదప

దివ్యాంగుల స్వావలంబనకు ప్ర‌గ‌తి చ‌క్రాలు!
విభిన్న ప్ర‌తిభావంతులు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా తమ పనులు చేసుకునేందుకు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మోటరైజ్డ్ త్రిచ‌క్ర వాహనాలు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల స‌హాయ సంస్థ ఛైర్మ‌న్ గ‌డుపూటి నారాయ‌ణ‌స్వామి, ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. విజయవాడ క‌లెక్ట‌రేట్‌లో విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో 58 మందికి రూ. 66.70 ల‌క్ష‌లు విలువైన స్కూట‌ర్ల‌ను అందించారు. నారాయ‌ణ‌స్వామి మాట్లాడుతూ దివ్యాంగుల‌కు ఈ వాహ‌నాలు ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం ఉపాధి, ఇతర జీవనోపాధి కార్యకలాపాలకు సులభంగా వెళ్లేందుకు ఉపయోగపడతాయని అన్నారు. రోజువారీ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవ‌స‌రం లేకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. వాహనం కేవలం రాకపోకలకు మాత్రమే కాకుండా దివ్యాంగుల స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి, జీవనోపాధికి ఒక సాధనంగా నిలుస్తాయ‌న్నారు.
Andhra Pradesh Government
Persons with Disabilities
Disability Welfare
Motorized Tricycles
Self Reliance
Disability Empowerment
సహాయక పరికరాలు
ఉపాధి అవకాశాలు
స్వయం ఉపాధి
సామాజిక సంక్షేమం
విభిన్న ప్రతిభావంతులు
సమగ్ర అభివృద్ధి
Scroll for the next article