Mobiles7th Jun 12:49 PMSunil Byrisetty1 min read
మోటోరోలా ఎడ్జ్ 60.. అద్భుత ఫీచర్లతో అదిరిపోయే ఫోన్
మోటోరోలా తాజాగా విడుదల చేసిన మోటోరోలా ఎడ్జ్ 60 అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. తక్కువ బరువుతో సన్నగా ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v15పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 7.9mm మందం, 179గ్రాముల
మోటోరోలా తాజాగా విడుదల చేసిన మోటోరోలా ఎడ్జ్ 60 అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. తక్కువ బరువుతో సన్నగా ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v15పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 7.9mm మందం, 179గ్రాముల బరువుతో వస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంది. డిజైన్ ప్రీమియం, పోర్టబిలిటీ ఇష్టపడే యూజర్లకు బెస్ట్ ఫోన్ గా చెప్పవచ్చు. 6.7-అంగుళాల OLED స్క్రీన్, 1220 x 2712 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. 446ppi పిక్సెల్ సాంద్రత, మిడ్-టైర్ HDR10+ సపోర్ట్, పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ 50MP మెయిన్, 50MP అల్ట్రా-వైడ్, OIS సపోర్టుతో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. 30fps వద్ద హై క్వాలిటీ 4K వీడియో రికార్డింగ్, హై రిజుల్యుషన్ 50MP ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్, ఫొటోగ్రఫీకి బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌తో పాటు ఆక్టా-కోర్ 2.5GHz ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్ కలిగి ఉంది. అదనంగా 8GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. అలాగే 5500mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆల్‌రౌండ్ ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ ఆప్షన్లలో ఒకటిగా ఉంది.