Mobiles15th Dec 05:06 PMSunil Byrisetty1 min read
మోటోరోలా కొత్త ఎడ్జ్ 70.. చార్జింగ్ ఇక వైర్‌లెస్
మోటోరోలా సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 'మోటోరోలా ఎడ్జ్ 70'ను లాంచ్ చేసింది. భారత్‌లో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగిన ఏక
మోటోరోలా సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 'మోటోరోలా ఎడ్జ్ 70'ను లాంచ్ చేసింది. భారత్‌లో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగిన ఏకైక వేరియంట్ ధరను రూ. 29,999గా నిర్ణయించారు. డిసెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ ఛానళ్లలో ప్రారంభమవుతాయి. మోటరోలా ఎడ్జ్ 70 6.7-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ తో వచ్చింది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐ ఓఎస్, 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్ తో అందుబాటులోకి వస్తోంది. 50MP ప్రైమరీ కెమెరా (OIS), 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా దీని ప్రత్యేకతలు. 5000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో 68W వైర్డ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఆకర్షణలుగా ఉన్నాయి. ఈ ఫోన్‌కు మూడు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తామని మోటరోలా ప్రకటించింది.