Mobiles13th Dec 12:35 PMSunil Byrisetty1 min read

మోటో వేగన్ లెదర్ డిజైన్ ఫోన్

మోటోరోలా నుంచి మరొక ప్రీమియం స్మార్ట్ ఫోన్ అయిన Motorola Edge 70 డిసెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్లలో విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాస

మోటో వేగన్ లెదర్ డిజైన్ ఫోన్
మోటోరోలా నుంచి మరొక ప్రీమియం స్మార్ట్ ఫోన్ అయిన Motorola Edge 70 డిసెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్లలో విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 50MP కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ కలర్‌ఫుల్ వేగాన్ లెదర్ డిజైన్‌తో ఆకట్టుకోనుంది. ఇక ఈ ఫోన్ ధర సుమారు రూ. 29,990 ఉండొచ్చని అంచనా. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పోస్టర్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అయిన ఫ్లిప్ కార్ట్ తో పాటు మోటోరోలా అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శించారు. ఆన్ లైన్ లో లీక్ అయిన ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 gen 4 ప్రాసెసర్ తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం, 68 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. మరొకవైపు ఎప్పటిలానే ఈ స్మార్ట్ ఫోన్ కూడా కలర్ ఫుల్ వేగాన్ లెదర్ డిజైన్ తో విడుదల కానున్నట్లు తెలుస్తుంది. మరొకవైపు ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లో అందుబాటులోకి రానుంది.
Motorola Edge 70
Motorola Smartphone
Vegan Leather Design
Snapdragon 7 Gen 4
50MP Camera
68W Fast Charging
5000mAh Battery
Android 16
Flipkart Launch
Motorola India
Premium Smartphone
12GB RAM
256GB Storage
Scroll for the next article