News3rd Jun 11:12 AMSunil Byrisetty1 min read
మిసెస్ తెలుగు యూఎస్ఏ రన్నర్ అప్‌గా గుడివాడ మగువ!
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పట్టుదలతో ఏపీపీఎస్సీలో ఉద్యోగం సంపాదించడమే కాదు.. ఉద్యోగం వీడి భర్తతో అమెరికాకు వెళ్లినా తన ప్రతిభతో ఇంక
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పట్టుదలతో ఏపీపీఎస్సీలో ఉద్యోగం సంపాదించడమే కాదు.. ఉద్యోగం వీడి భర్తతో అమెరికాకు వెళ్లినా తన ప్రతిభతో ఇంకా రాణిస్తూనే ఉన్నారు. ఇందుకు గత నెల 26వ తేదీన అమెరికాల్లోని డల్లాస్‌లో ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్లో జరిగిన మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. గుడివాడకు చెందిన మౌనిక బెంగళూరులో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 2013లో ఏపీపీఎస్సీలో ఉద్యోగం సంపాదించి వరంగల్‌లో ఇరిగేషన్ ఏఈగా విధుల్లో చేరారు. అనంతరం జితేంద్రతో వివాహం కావడంతో తన ఉద్యోగాన్ని వీడి భర్తతో 2017లో అమెరికా వెళ్లారు. తాజాగా మౌనిక మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీల్లో పాల్గొని వేల మందిని దాటుకుని 25 మంది తుది జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. అనంతరం గత నెల 26వ తేదీన జరిగిన తుది పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకున్నారు. దీంతో గుడివాడలో ఆమె తల్లిదండ్రులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఆడవాళ్లు దేనిలోనూ తక్కువ కాదంటూ ఆత్మవిశ్వాసం వల్లే మౌనిక ఈ విజయం సాధించారని చెబుతున్నారు.