Crime1st Oct 12:34 PMSunil Byrisetty1 min read
క్రైమ్ సినిమాలా సినిమా పైరసీ
హ్యాకింగ్ చేసి సినిమా విడుదలకు ముందే ఏకంగా హై డెఫనిషన్ సినిమాలు డౌన్లోడ్ చేసి ఇండస్ట్రీని వణికించిన 22 ఏళ్ల బీహార్ యువకుడిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిక్ సినిమా తర
హ్యాకింగ్ చేసి సినిమా విడుదలకు ముందే ఏకంగా హై డెఫనిషన్ సినిమాలు డౌన్లోడ్ చేసి ఇండస్ట్రీని వణికించిన 22 ఏళ్ల బీహార్ యువకుడిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కిక్ సినిమా తరహాలో విడుదలకు అందరికంటే ముందు సినిమా చూడాలని హ్యాకింగ్ చేసి సినిమా డౌన్లోడ్ చేసి చూసి క్రమక్రమంగా పైరసీ రాకెట్ లోకి ఇంటర్ చదివిన యువకుడు దిగాడు. మూవీ పైరసీ ముఠా అరెస్టు కేసులో విస్తుపోయే విషయాలను సీపీ సీవీ ఆనంద్ బయటపెట్టారు. హ్యాక్ చేసి మూవీ ఇండస్ట్రీని గడగడలాడించిన పాట్నాకి చెందిన అశ్వనీకుమార్ అనే 22 ఏండ్ల యువకుడుగా గుర్తించారు. పాట్నాలో ఒక చిన్న ఇంట్లో కూర్చొని పలు కంపెనీల సైట్లను హ్యాక్ చేసి.. ఒక్కో సినిమాని 800 డాలర్లకు అమ్మినట్లు తెలిపారు. మొత్తం లక్ష యూఎస్ డాలర్ల వరకు పైరసీ సినిమాలు అమ్మి క్రిప్టో ద్వారా సంపాదించినట్లు వెల్లడించారు.