News5th Nov 02:21 PMSunil Byrisetty1 min read
పీపీపీపై ఎంపీ అవినాష్ కీలక వ్యాఖ్యలు
మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీరియస్ అయ్యారు. నెల రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతోందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ప్ర
మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీరియస్ అయ్యారు. నెల రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతోందన్నారు.
ప్రజలు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదని, పైగా పులివెందుల మెడికల్ కాలేజ్ లో ఉన్న అత్యాధునిక పరికరాలను తరలించేస్తున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం మెడికల్ సీట్లు రాకుండా చేసిందని, ఇప్పుడు పరికరాలు కూడా తరలించేస్తున్నారని మండిపడ్డారు.
పులివెందుల ప్రాంతం అంటే ఎందుకింత కక్ష అని, ఈ ప్రాంత టీడీపీ నాయకులు దీనికి ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ప్రైవేటీకరణ, పరికరాల తరలింపు ఆపాలని డిమాండ్ చేశారు.