Politics21st Aug 04:17 PMSunil Byrisetty1 min read
జగన్ పై ఎంపీ విజయ్ వ్యంగ్యాస్త్రాలు
జగన్ పై రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి తేడా తెలియని జగన్ గురించి అన్ని జనరేషన్స్ ఆలోచన చేయ
జగన్ పై రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి తేడా తెలియని జగన్ గురించి అన్ని జనరేషన్స్ ఆలోచన చేయాలన్నారు. పబ్లిక్ సర్వీస్ పరీక్ష లో సర్వీస్ అనే పదాన్ని హోటల్ సర్వీస్ అనుకుని మూల్యాంకనం రిసార్ట్ లో పెట్టినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్లు ఉంటాయనే విషయం కూడా తెలియని వ్యక్తి 5ఏళ్లు ముఖ్యమంత్రిగా చేయటం ఖర్మ కాక మరేంటని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ కి డీఎస్సీ కి తేడా తెలియని వాడు, రాజ్యాంగం తెలియని వాడు కాబట్టే అసెంబ్లీ కి రానంటున్నారంటూ విమర్శలు చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాల విలువ తెలియక హైల్యాండ్ లో పేపర్లు దిద్దించి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. డీఎస్సీ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన దమ్మున్న నాయకుడు లోకేష్ అని కొనియాడారు.