News25th Mar 05:27 PMSunil Byrisetty1 min read
జరగని లిక్కర్ స్కాంపై టీడీపీ తప్పుడు ప్రచారం
అసలు జరగని లిక్కర్ స్కాంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, లోక్‌సభలో టీడీపీ ఎంపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైయస్సార్సీపీపై ఆరోపణలు
అసలు జరగని లిక్కర్ స్కాంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, లోక్‌సభలో టీడీపీ ఎంపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైయస్సార్సీపీపై ఆరోపణలు చేస్తున్నారని వైయస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి స్పష్టం చేశారు.
అసలు వైయస్సార్సీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదన్న ఆయన, తమ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెంచారని, షాపుల సంఖ్య, మద్యం అమ్మకం వేళలు తగ్గించారని ఆయన వెల్లడించారు.
నిజానికి రాష్ట్రంలో కొత్తగా 200 బ్రాండ్లను తీసుకొచ్చింది చంద్రబాబుగారి హయాంలోనే అని గుర్తు చేసిన ఆయన, వాస్తవాలను దాచి వైయస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. టీడీపీ ఎంపీలకు ధైర్యం ఉంటే చంద్రబాబు అందుకున్న ఈడీ, ఐటీ నోటీసులు చర్చిద్దామని ఎంపీ ఎం.గురుమూర్తి సవాల్ చేశారు. పార్లమెంట్‌లో వైయస్సార్సీపీ మీద కేవలం బురద జల్లడానికే, చంద్రబాబు తమ ఎంపీలను ఉపయోగించుకుంటున్నారు.
రాష్ట్ర అభివృద్దికి నిధులు తీసుకురావడంలో వారి ప్రమేయం శూన్యం. ఇదే విషయం ఈ పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి స్పష్టమైంది. లేని లిక్కర్ స్కాంను సృష్టించి రాష్ట్రంలో జగన్ పాలనలో వేల కోట్ల విలువైన లిక్కర్ స్కాం జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో పార్లమెంట్‌లో మాట్లాడించారు. పది నెలల పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఇలాంటి పస లేని విమర్శలు చేస్తోందని గురుమూర్తి వ్యాఖ్యానించారు.