News28th Jun 11:29 AMSunil Byrisetty1 min read

మామిడి రైతులను ఆదుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి తిరుపతి ఎం

మామిడి రైతులను ఆదుకోవాలి
ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. లేఖలో ఎంపీ పేర్కొన్న వివరాల ప్రకారం, దేశంలోనే అత్యధికంగా 12.35 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందన్నారు. ఇది దేశ మామిడి సాగు విస్తీర్ణంలో 16.5 శాతం వాటాను కలిగి ఉందని, అయితే విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉండడం సాగు సమస్యలను సూచిస్తోందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో విస్తృతంగా సాగు అయ్యే తోతాపురి మామిడి ధరలు భారీగా క్షీణించడంతో రైతులు నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మామిడి మద్దతు ధర కిలోకు రూ.12 ఉన్నప్పటికీ రైతులు కిలో కేవలం రూపాయి నుండి నాలుగు రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, ఇది పంట పెట్టుబడులను కూడా తిరిగి పొందహలేని దుస్థితి అని వివరించారు.
Andhra Pradesh news
ysrcp
gurumurthy
Union minister Shivraj Singh
మామిడి రైతులను ఆదుకోవాలి
12.35 లక్షల ఎకరాల్లో మామిడి సాగు
Scroll for the next article