News4th Dec 03:21 PMSunil Byrisetty1 min read

ఫ‌లించిన ఎంపీ కేశినేని శివనాథ్ కృషి

విజ‌య‌వాడ విమ‌నాశ్ర‌యం నుంచి విజ‌య‌వాడ -హైద‌రాబాద్ మ‌ధ్య వైడ్ బాడీ విమానాలు అందుబాటులో తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ చేసిన కృషి ఫ‌లించింది. ఢిల్లీలోని కేంద్ర పౌర‌విమానాయ‌న శాఖ

ఫ‌లించిన ఎంపీ కేశినేని శివనాథ్ కృషి
విజ‌య‌వాడ విమ‌నాశ్ర‌యం నుంచి విజ‌య‌వాడ -హైద‌రాబాద్ మ‌ధ్య వైడ్ బాడీ విమానాలు అందుబాటులో తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ చేసిన కృషి ఫ‌లించింది. ఢిల్లీలోని కేంద్ర పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడు కార్యాల‌యంలో ఇండిగో ప్లైయిట్ స్పెష‌ల్ డైరెక్ట‌ర్ ఎ.కె.సింగ్ తో ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎంపీ జి.ఎం. హరీష్ ల‌కు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ -హైద‌రాబాద్ మ‌ధ్య ఎటిఆర్ విమానాల వ‌ల్ల ప్ర‌యాణీకుల టిక్కెట్ ఆర్థిక భారం గురించి, సీట్లు అందుబాటులో వుండ‌ని విష‌యం, ల‌గేజీ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. ఈ స‌మ‌స్య‌లపై ఇండిగో ప్లైయిట్ స్పెష‌ల్ డైరెక్ట‌ర్ ఎ.కె.సింగ్ మాట్లాడుతూ వారం, ప‌దిరోజుల్లో విజ‌య‌వాడ‌- హైద‌రాబాద్ మ‌ధ్య వైడ్-బాడీ విమాన స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని అంగీక‌రించారు. వైడ్ - బాడీ విమానాలు అందుబాటులోకి వ‌స్తే టిక్కెట్ ధ‌ర త‌గ్గ‌టంతో పాటు సీట్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వివ‌రించారు. విజయవాడ నుంచి వారణాసి, అహ్మాదాబాద్, పుణే, కొచ్చిన్, గోవా విమాన సర్వీసులు న‌డిపించేందు రూట్ మ్యాపింగ్ చేసుకుని మొద‌లు పెడ‌తామ‌న్నారు.
AP News
Aviation Updates
Vijayawada Airport
Kesineni Shivanath
Indigo Airlines
Wide Body Flights
Hyderabad Flights
Ram Mohan Naidu
GM Harish
Flight Services
రామ్మోహన్ నాయుడు
జీఎం హరీష్
ఫ్లైట్ సర్వీసులు
Scroll for the next article