News28th Nov 05:23 PMSunil Byrisetty1 min read
నాసా ప్రాజెక్ట్ విద్యార్ధులకు అభినందనలు
నాసా ప్రాజెక్ట్ చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్, భవానిపురం కి చెందిన 25 మంది విద్యార్దులు శుక్రవారం ఎంపీ కేశినేని శివనాథ్ ను పశ్చిమ నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ
నాసా ప్రాజెక్ట్ చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్, భవానిపురం కి చెందిన 25 మంది విద్యార్దులు శుక్రవారం ఎంపీ కేశినేని శివనాథ్ ను పశ్చిమ నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ ప్రాజెక్ట్ చేస్తున్న విద్యార్ధులకు స్కూల్ అందించే నాసా ప్రాజెక్ట్ కిట్స్ ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారు. వారితో మాట్లాడి ఎలాంటి ప్రాజెక్టులు చేయబోతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఎంపికై అమెరికా లో ఏప్రిల్ లో జరిగే నాసా ఐ.ఎస్.డి.సి కాన్ఫరెన్స్ కి హాజరు కావాలని ఆశీస్సులు అందించారు. విద్యార్ధులను టెక్నాలజీ రంగంపై ఆసక్తి కలిగించే ప్రోత్సహిస్తున్నందుకు స్కూల్ ప్రిన్సిపాల్ ప్రదీప్ ను, నాసా ప్రాజెక్ట్ ఇన్చార్జ్ ప్రణీతలను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.