News12th Aug 08:41 AMSunil Byrisetty1 min read

ప్ర‌ధానికి ధ‌న్య‌వాదాలు తెలిపిన ఎంపీ కేశినేని

పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌పై చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ విజ‌య‌వంతంగా పూర్తయిన సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీకి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేంద

ప్ర‌ధానికి ధ‌న్య‌వాదాలు తెలిపిన ఎంపీ కేశినేని
పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌పై చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ విజ‌య‌వంతంగా పూర్తయిన సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీకి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, స‌హ‌చ‌ర టిడిపి ఎంపీల‌తో క‌లిసి పార్ల‌మెంట్ లోని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కార్యాలయంలో ఆయ‌న్ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అలాగే అంద‌రూ ఎంపీలు ఆప‌రేష‌న్ సింధూర్ విజ‌యవంతం చేసినందుకు పీఎం మోదీకి కృతజ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రాభివృద్దికి అవ‌స‌ర‌మైన ప్రాజెక్టల‌ ను త్వ‌రిత‌గ‌తిన మంజూరు చేస్తున్నందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని అమృత భార‌త్ 2.0 కింద విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ అభివృద్ది ప‌నులకు అవ‌స‌ర‌మైన రూ.850 కోట్లు నిధులు నీతి ఆయోగ్ ద్వారా ఆమోదం చేయించినందుకు ధన్య‌వాదాలు తెలిపారు. అలాగే నీతి ఆయోగ్ ఆమోదం తెలిపిన నిధులు రైల్వే శాఖ నుంచి త్వ‌రిత‌గ‌తిన మంజూరు చేయించ‌వ‌ల్సిందిగా కోరారు.
Andhra Pradesh news
Operation Sindhoor
Kesineni Sivanath
PM Narendra Modi
TDP MPs
Vijayawada Railway Station
Amrit Bharat 2.0
NITI Aayog
Railway Development
Pakistan Terrorists
ఆపరేషన్ సింధూర్
కేశినేని శివనాథ్
Scroll for the next article